Sun Dec 29 2024 19:11:17 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : హైడ్రాపై ఫుల్లు క్లారిటీ ఇచ్చిన కమిషనర్ రంగనాధ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ పరిధి ఏంటో చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు వరకూ హైడ్రా పరిధి ఉందని తెలిపారు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ పరిధి ఏంటో చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు వరకూ హైడ్రా పరిధి ఉందని తెలిపారు. హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందని, ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాదికి రూట్ మ్యాప్ సిద్దం చేశామని చెప్పారు. జీహెచ్ ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని గుర్తు చేశారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటి వరకూ పరిరక్షించామని కమిషనర్ రంగనాధ్ తెలిపారు. పన్నెండు చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా హైడ్రా రక్షించిందని తెలిపారు. ఎఫ్ టీఎల్ , బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన పెరిగిందన్న ఆయన 1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తామని తెలిపారు.
ఎఫ్.టి.ఎల్ నిర్ధారణ ఇలా...
సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తామని తెలిపారు. ఎఫ్ టీఎల్ ను పారదర్శకంగా చేయడం తమ బాధ్యత అని అన్నారు. శాటిలైట్ ఇమేజ్ తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నామని, 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్ తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్ టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నామని రంగనాధ్ తెలిపారు. ఎఫ్ టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుందని, శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్ టీఎల్ నిర్దారణ జరుగుతుందన్నారు. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నామని, 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయని, అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని రంగనాధ్ తెలిపారు.
కఠినంగానే వ్యవహరిస్తాం...
భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్ పై కుడా దృష్టి పెట్టామన్న ఆయన 2025 లో జియో ఫెన్సింగ్ సర్వే నిర్వహిస్తామని చెప్పారు. నాగోల్ లో ఉన్న డీఆర్ ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తామని రంగనాధ్ తెలిపారు. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుందని చెప్పారు. వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రా లో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నామని, హైడ్రా కు త్వరలో ఒక ఎఫ్ ఎం ఛానల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని రంగనాధ్ తెలిపారు. జులై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతిసోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, ఎఫ్ టీఎల్ లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దని, ప్రజల ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నామని రంగనాధ్ చెప్పారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story