Wed Mar 26 2025 06:23:27 GMT+0000 (Coordinated Universal Time)
హైడ్రా కూల్చివేతలు ప్రారంభం
సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది.

సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. పార్క్ స్థలాన్ని ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుమండలం ముత్తంగి గ్రామంలో 296 సర్వే నెంబర్ల లో ఉన్న గాయత్రీ వెంచర్లు పార్క్ స్థలం కబ్జా చేసి షెడ్డు నిర్మాణం చేపట్టింది. దీనిపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.
అక్రమంగా నిర్మిస్తున్న...
దీనిని పరిశీలించుకున్న అధికారులు వాటిని అక్రమ నిర్మాణాలుగా గుర్తించారు. బుల్ డోజర్ తో వచ్చి కూల్చివేతల ప్రక్రియను హైడ్రా సిబ్బంది ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలపై ఎవరు ఫిర్యాదు చేసినా వాటిని నిర్ధారించుకున్న తర్వాతనే హైడ్రా అధికారుల కూల్చివేతల ప్రక్రియను ప్రారంభిస్తారు.
Next Story