నేను నా ఇంట్లోనే ఉన్నాను....!! అవన్నీ అవాస్తవాలు..!!
తన పై జరుగుతున్న ప్రచారాలు అన్నీ అవాస్తవాలు అని, తాను ఎక్కడానికి వెళ్ళలేదని, తాను తన ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తెలుసుకుంటున్నానని సీనీ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు...!!!
ఇటీవల జర్నలిస్టు పై హత్యాయత్నం కేసులో మంచు మోహన్ బాబు చిక్కుల్లో పడిపోవటం మనందరికీ తెలిసిందే.....!!!
ఈ క్రమంలో తాను హాస్పిటల్ లో జాయిన్ అవటం, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.....!!!!
ఇక్కడి వరకూ ప్రశాంతంగానే ఉంది కానీ.... సడెన్ గా..దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసిన పుష్పా -2 సినిమా ప్రీమియర్ షో లో జరిగిన తొక్కిసలాటలో రేవతీ అనే మహిళ అక్కడిక్కడే చనిపోవటం..,తన కుమారుడు కూడా అదే తొక్కిసలాటలో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం..,దీనిపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు తొక్కిసలాటకు కారణం అయిన హీరో అల్లు అర్జున్ ని, మరియు సంఘటన జరిగిన సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు...!! ఎవ్వరూ ఊహించని విధంగా..జరిగి., చివరికి అనేక అవాంతరాలు మధ్య అల్లు అర్జున్ మరియు థియేటర్ యాజమాన్యం విడుదల కావటం జరిగింది..
ఈ నేపథ్యంలో...ఇంత పెద్ద యాక్టర్ ని అరెస్టు చేసినప్పుడు, హత్యాయత్నం కేసులో ఉన్న మోహన్ బాబు ని కూడా అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది....
ఈ ప్రచారానికి ఆజ్యం పోస్తూ.... ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న పిటీషన్ హైకోర్టు కొట్టివేసింది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది...!! దానికి తోడు మోహన్ బాబు హాస్పిటల్ నుండి, తాను ఉంటున్న ఫాం హౌస్ నుండి పరారయ్యారని, తనని పట్టుకోవడానికి నాలుగైదు బృందాలు రంగంలోకి దాగాయని,ఏం క్షణం లోనైనా అరెస్టు చేయొచ్చు అని జోరుగా ప్రచారం జరిగింది...!!
అసలు తను ఎటూ పారిపోలేదని,తన బెయిల్ పిటిషన్ కాన్సిల్ కాలేదని ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు...!!!