Mon Nov 18 2024 01:24:34 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : 12 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో టెన్షన్
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు టెన్షన్ పడుతున్నారు
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఈరోజు ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పై విచారణ జరగనుంది. హైకోర్టులో నేడు విచారణ జరుగుతున్న సందర్భంలో తీర్పు ఎలా వస్తుందోనన్న టెన్షన్ అందరికీ పట్టుకుంది. దాదాపు పన్నెండు మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏపీకి వెళ్లాల్సి ఉన్నా తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఏపీకి వెళ్లడానికి ఇష్టపడని అధికారులు తెలంగాణలోనే పనిచేస్తున్నారు.
ఏపీకి వెళ్లాలని...
క్యాట్ తీర్పును అడ్డం పెట్టుకుని తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్న అధికారులకు హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో? నన్న ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. వీరందరిపై కేంద్ర ప్రభుత్వం 2017లోనే రిట్ పిటీషన్ వేసింది. ప్రస్తుత డీజీపీ అంజనీకుమార్ తో పాటు, అభిషేక్ మహంతి వంటి అధికారులున్నారు. హైకోర్టులో తుది విచారణ జరుగుతుండటంతో తీర్పు ఎలా వస్తుందన్న దానిపై టెన్షన్ పడుతున్నారు. సోమేష్ కుమార్ విషయంలో గతంలో హైకోర్టు తీర్పును చూసి వీరు కూడా భయపడిపోతున్నారు.
Next Story