Thu Nov 28 2024 10:53:00 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ వ్యాఖ్యలకు ఐఏఎస్ అధికారుల అభ్యంతరం
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీాఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐఎఎస్ అధికారుల సంఘం అభ్యంతరం తెలిపింది
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ చేసిన అవమానకరమైన మరియు ఆధారరహిత ఆరోపణలను తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు ఆయన నిష్పక్షపాతం మరియు విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉందని అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు పాలనా విధానాలు మరియు రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
ప్రజాపాలనపై...
ప్రజాసేవలో అధికారి విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుందని, అయితే, ఇటువంటి నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని ఐఏఎస్ అధికారుల సంఘం తెలిపింది.తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఈ సందర్భంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు పూర్తి మద్దతు తెలియజేస్తుందన్నారు. సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి తాము అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేస్తోంది. కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నాలు, విధి నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీయడంతో పాటు, పాలన పట్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయని పేర్కొంది. అందువల్ల, ఇటువంటి నిరాధార ఆరోపణలను వెంటనే నిలిపివేయాలని, వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం పిలుపునిస్తోంది.
Next Story