Mon Dec 23 2024 14:35:49 GMT+0000 (Coordinated Universal Time)
ఐఏఎస్లకు క్యాట్లో చుక్కెదురు.. దక్కని ఊరట
ఐఏఎస్ అధికారులకు క్యాట్ లో ఊరట లభించలేదు. ఎక్కడి వాళ్లు అక్కడే రిపోర్టు చేయాలని ఆదేశించింది
ఐఏఎస్ అధికారులకు క్యాట్ లో ఊరట లభించలేదు. ఎక్కడి వాళ్లు అక్కడే రిపోర్టు చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణలో కొనసాగించాలని క్యాట్ ను ఐఏఎస్ అధికారులు ఆశ్రయించారు. ఈ నెల 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కె. ఆమ్రపాలి, వాణిప్రసాద్, డి. రొనాల్డ్ రాస్, జి సృజనలు క్యాట్ ను ఆశ్రయించగా వాటిని క్యాట్ పట్టించుకోలేదు. ఎక్కడి వాళ్లు అక్కడే రిపోర్టు చేయాలని క్యాట్ ఆదేశించింది. స్టే ఇవ్వలేదు. అయితే ఈ సందర్భంగా క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారని, అక్కడకు వెళ్లి సేవలు చేయాలని లేదా? అని క్యాట్ ప్రశ్నించింది.
ఎక్కడి వారు అక్కడే....
ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై డీవోపీటీకి పూర్తిస్థాయి అధికారాలున్నాయని తెలిపింది. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్ లైన్స్ లో ఉందా అని ఈ సందర్భంగా క్యాట్ ప్రశ్నించింది. వన్ మ్యాన్ కమిటీ సిఫార్సులను డీవోపీటీ పట్టించుకోవడం లేదని ఐఏఎస్ అధికారుల తరుపున న్యాయవాది క్యాట్ దృష్టికి తెచ్చారు. సింగిల్ మెన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేముందు కమిటీ నివేదిక ఇవ్వలేదన్నారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు. ప్రస్తుతం ఆమ్రపాలి, వాణిప్రసాద్, వాకాటి కరుణ ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది. ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంటుంది. అయితే ఈరోజు క్యాట్ లో ఊరట లభించకపోవడంతో రేపు ఐఏఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించే అవకాశముందని వారి తరుపున న్యాయవాదులు తెలిపారు. రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు.
Next Story