Sun Dec 22 2024 02:58:12 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Vehicle Registration : నేడు TS నుంచి TGగా నెంబర్లు మార్పు
కాంగ్రెస్ అధికారంలో రాగానే తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో టీఎస్ నుంచి టీజీగా వాహన రిజిస్ట్రేషన్ల నెంబర్లను మార్చడం
Telangana Vehicle Registration :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో టీఎస్ నుంచి టీజీగా వాహన రిజిస్ట్రేషన్ల నెంబర్లను మార్చడం. ఈ ప్రక్రియ నేటి నుంచి అమలులోకి రానుంది. నేటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే అన్ని వాహనాలకు TS నుంచి TGగా మారుస్తూ రవాణా శాఖ నెంబర్లను జారీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రావడంతో నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ తో వాహనాల నెంబర్లు తెలంగాణలో దర్శనమివ్వనున్నాయి.
కొత్త వాహనాలకు....
తెలంగాణలోని యాభై ఆరు ఆర్టీఏ కార్యాలయాల్లో నేటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు TGగా నమోదు చేస్తారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను చేయనున్నారు. ఉదయం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఫ్యాన్సీ నంబర్లు కూడా కొత్త రిజిస్ట్రేషన్ రావడంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.
Next Story