Sun Dec 22 2024 23:24:14 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నేడు కీలక సమావేశం.. లోక్సభ ఎన్నికలపై
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై చర్చించనున్నారు
నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగనుంది. పీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై చర్చించనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పథ్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా చేయాల్సిన ప్రచారం, తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
6న తుక్కుగూడలో...
వచ్చే నెల 6వ తేదీన తుక్కుగూడలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తుండటంతో జనసమీకరణపై కూడా సమావేశంలో నేతలకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేయనున్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు పాల్గొంటారు. పార్టీలో నేతల చేరిక అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story