Wed Nov 27 2024 22:51:45 GMT+0000 (Coordinated Universal Time)
పాపం వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు: బండి సంజయ్
సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్, గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి సరైన సౌకర్యాలు కల్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కోరారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు పనులు చేస్తున్నారని..
సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్, గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి సరైన సౌకర్యాలు కల్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కోరారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు పనులు చేస్తున్నారని.. దీనివలన ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో తెలిపారు. సమయపాలన అశాస్త్రీయంగా ఉందని, సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారని, ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
గురుకుల విద్యాసంస్థలకు సరైన భవనాలు, మౌలిక సదుపాయాలు లేవన్నారు బండి సంజయ్. జిల్లాల్లో విద్యార్థులకు శాశ్వత నివాస గృహాలు అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయ సిబ్బంది రాత్రి 9.30 గంటల తర్వాత స్టడీ అవర్స్ పూర్తి చేసుకుని వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పోలీసు కానిస్టేబుళ్లకు పెండింగ్లో ఉన్న డీఏ, టీఏ, పీఆర్సీ అలవెన్సులను త్వరగా చెల్లించాలని సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story