Sat Jan 11 2025 14:53:21 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : నేడు మరోసారి విచారణ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. డిసెంబరు 26వ తేదీన ఇచ్చిన ఆర్డర్ ను కొన్ని రోజుల పాటు నిలిపేయాలని సింగిల్ జడ్జిని ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6న చీఫ్ జస్టిస్ బెంచి రిట్ అప్పీల్ ను కొట్టేసింది. అయితే లంచ్ మోషన్ పిటీషన్ ను ప్రభుత్వం దాకలు చేసింది.
సుప్రీంకోర్టులో కేసు...
ఒకే కేసుపై హైకోర్టులో రెండు తీర్పులు ఉన్నందున చీఫ్ జస్టిస్ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు నేడు చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతిని ప్రభుత్వం కోరనుంది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చే వరకూ ఆర్డర్ అమలు కాకుండా చూడాలని ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. కేసు వివరాలను అప్పగించాలని సీబీఐ వత్తిడి చేస్తున్నందున ప్రభుత్వం సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకూ పెండింగ్ లో పెట్టాలని కోరనుంది. దీనిపై నేడు విచారణ జరగనుంది.
Next Story