Mon Dec 23 2024 15:34:31 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ బర్త్ డే వేడుకలు : ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
కాచిగూడ లో అంబర్ పేట్ ఎమ్మెల్యే కు కాలేరు వెంకటేష్ కు ప్రమాదం తృటిలో తప్పింది
కాచిగూడ లో అంబర్ పేట్ ఎమ్మెల్యే కు కాలేరు వెంకటేష్ కు ప్రమాదం తృటిలో తప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకల్లో హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గ్యాస్ బెలున్లు గాలిలో వదులుతున్నారు. అదే సమయంలో కార్యకర్తలు టపాసులు కాల్చడం తో నిప్పు రవ్వలు చెలరేగాయి.
ఒక్కసారిగా పేలడంతో...
చెలరేగిన నిప్పురవ్వలు బెలూన్లపై పడి ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేతో పాటు నేతలు పరుగులు తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తట్టుకుని కింద పడ్డారు. ఈ సందర్భంగా పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది.
Next Story