Sun Dec 22 2024 22:54:40 GMT+0000 (Coordinated Universal Time)
Tiger : పులి అక్కడే తిరుగుతుంది.. మరో జీవిని బలితీసుకుందిగా
కుమరం భీం జిల్లాలో పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు
కుమరం భీం జిల్లాలో పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా అక్కడే ఉన్న పులి జాడ మాత్రం దొరకడం లేదు. ఇటీల ఆ జిల్లాలో ఒక మహిళపై దాడి చేయడంతో మరణించిన సంగతి తెలిసిందే. అదే పులి మరో రైతుపై కూడా దాడికి దిగింది. తాజాగా పులి గేదెపై దాడి చేసింది. ఈ దాడిలో గెదె చనిపోయింది. కుమురం భీం జిల్లాలో గేదెపై పులి దాడి చేయడంతో అది చనిపోయింది. ఈ పులి మహారాష్ట్ర ప్రాంతంలోని ఉడికి నుంచి తెలంగాణ ప్రాంతంలోని సరిహద్దు ప్రాంతమైన కుమురం భీం జిల్లాకు చేరింది. పులి వచ్చి ఎనిమిది రోజుల నుంచి రోజుకు ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది.
అటవీ శాఖ అధికారులకు...
అటవీ శాఖ అధికారులు పులిని బంధించేందుకు అనేక ఏర్పాట్లు చేస్తున్నా ఫలితం లేదు. వారికి చిక్కడం లేదు. డ్రోన్ కెమెరాలకు కూడా పులి జాడ కనిపించడం లేదు. అయితే ఈ సీజన్ లో పులి కొంత అగ్రెస్సివ్ గా ఉంటుందని, అది కనిపించిన వాటిపై దాడి చేసి చంపేస్తుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పులి మరో దానితో కలవడం కోసం తిరుగుతుందని, కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చి ఇక్కడకు చేరుకుందని తెలిపారు. ఈ సీజన్ లో పులి అలాగే ప్రవర్తిస్తుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
అక్కడే ఉండటంతో...
పులి అక్కడే సంచరిస్తుండటంతో పాటు చీలపల్లిలో గేదెపై దాడి చేసిన ఘటన మరింత కలవరానికి గురి చేస్తుంది. ఆ ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించి పులి పాదముద్రలను గుర్తించారు. డోన్ కెమెరాలకు, ట్రాకింగ్ కెమెరాలకు కూడా చిక్కకుండా పులి తప్పించుకుని తిరుగుతుంది. ఎనిమిది రోజుల నుంచి అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పులి అక్కడే సంచరిస్తుండటంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. పొలాలకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పులి ఎప్పుడు దొరుకుతుందా? అని ఇంటికే ప్రజలు పరిమితమయ్యారు.
Next Story