Mon Dec 23 2024 12:51:58 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
తెలంగాణలో ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదం జరిగింది
తెలంగాణలో ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం సంభవించింది. వుడ్ వర్క్ జరుగుతుండగా షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జిరిగినట్లు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అప్రమత్తమయిన అధికారులు వెంటనే అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసి రప్పించారు.
17న ప్రారంభం కావాల్సి ...
మంటలను అదుపులోకి తెచ్చారు. సచివాలయం పైన గుమ్మటంపై పొగలు రావడంతో స్థానికులు కూడా ఆందోళన చెందారు. అయితే తొలుత మాక్ డ్రిల్ అని అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా తర్వాత అది ఫైర్ యాక్సిడెంట్ గానే నిర్ధారణ అయింది. కొత్త సచివాలయం ఈ నెల 17వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. అగ్ని ప్రమాదం సంభవించడంతో ప్రభుత్వం దీనిపై విచారణ చేయాలని నిర్ణయించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story