Mon Dec 23 2024 14:39:23 GMT+0000 (Coordinated Universal Time)
ఇకపై అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం
అన్ని పాఠశాలల్లో ఇకపై ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు. 2022-23 విద్యాసంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. అలాగే ప్రైవేట్
తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఇకపై ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు. 2022-23 విద్యాసంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. అలాగే ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజులను కూడా రెగ్యులేట్ చేయనున్నారు. సోమవారం సీఎం కేసీఆర్ నివాసంలో భేటీ అనంతరం.. ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన సబ్ కమిటీకి ఆమెదం తెలిపింది కేబినెట్.
ఈ కమిటీలో కేటీఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారు. మన ఊరు - మన బడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. పాఠశాలల ఇన్ ఫ్రా స్ట్రక్చర్, ఫెసిలిటీల కోసం ప్రభుత్వం రూ.7,289 కోట్లు వెచ్చించనుంది. అలాగే ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీషు విద్యను బోధించేలా.. టీచర్లకు కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనుంది.
News Summary - In Telangana All Government Schools Become English Medium from 2022-2023 Educational Year
Next Story