Sat Dec 21 2024 08:21:05 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రికార్డు బ్రేక్.. తెలంగాణలో 18 రోజుల్లో ఎన్ని బీర్లు తాగేశారంటే?
తెలంగాణలో ఎండ వేడిమితో పాటు వడగాలులు కూడా తీవ్రంగా ఉండటంతో బీర్లను ఇష్టమొచ్చినట్లు తాగేస్తున్నారు
Telangana :ఎండలు మండి పోతున్నాయి. మందు బాబులు బీర్లు తాగేస్తున్నారు. ఎండ వేడిమితో పాటు వడగాలులు కూడా తీవ్రంగా ఉండటంతో బీర్లను ఇష్టమొచ్చినట్లు తాగేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం కేవలం పద్దెనిమిది రోజుల్లోనే 670 కోట్ల రూపాయల బీర్ల విక్రయాలు తెలంగాణలో జరిగాయి. అంటే ఏ స్థాయిలో బీర్లు తాగుతున్నారో ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు.
గత ఏడాది కంటే...
చల్లని బీర్ల కోసం వైన్ షాపుల వద్ద మందుబాబులు క్యూ కూడుతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోవడానికి చల్లటి బీర్లను తెగ తాగేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 28.7 శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అని చెబుతున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 18 వ తేదీ వరకూ దాదాపు 23,58,827 కేసుల బీర్లు అమ్ముడు పోయాయని తెలిపారు.
Next Story