Thu Dec 26 2024 15:43:40 GMT+0000 (Coordinated Universal Time)
యాభై ఒక్క గ్రామ పంచాయతీలు విలీనం
తెలంగాణ లో మరో 51 గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనంచేస్తూ నిర్ణయం తీసుకుంది
తెలంగాణ లో మరో 51 గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనంచేస్తూ నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని యాభై ఒక్క గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. యాభై ఒక్క గ్రామ పంచాయతీలు ఇకనుంచి సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి.
అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో...
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని యాభై ఒక్క గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో పంచాయతీల విలీనానికి లైన్ క్లియర్ అయింది. దీంతో ఈ గ్రామాల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని భావిస్తున్నారు.
Next Story