Wed Jan 15 2025 15:33:40 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఎమ్మెల్యే గారూ.. మా నియోజక వర్గానికి రావొద్దంటూ పోస్టర్లు
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేను ప్రజలు సంక్రాంతి వేళ వినూత్న రీతిలో తమన నిరసనను తెలియజేశారు
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేను ప్రజలు సంక్రాంతి వేళ వినూత్న రీతిలో తమన నిరసనను తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ లో ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హామీలపై నిలదీస్తూ ఈ పోస్టర్లను స్థానిక ప్రజలు వేసినట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎన్నికల ప్రచారంలో...
ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజలు ఈ పోస్టర్లను వేసినట్లు చెబుతున్నారు. రూపాయి వైద్యం, యువతకు ఉపాధి ఎక్కడ? గ్రామానికి పది ఇళ్లు ఏమయ్యాయి? అంటూ ఎన్నికల హామీలపై ప్రశ్నలు కురిపించారు. నందిపేట్ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యేకు నిలదీస్తూ వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
Next Story