Mon Dec 23 2024 00:48:37 GMT+0000 (Coordinated Universal Time)
ముదిరిన ఫ్లెక్సీల వార్
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఫ్లెక్సీల వార్ ముదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 2వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు.
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఫ్లెక్సీల వార్ ముదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 2వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు. 3వ తేదీన హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటారని ముందుగానే గ్రహించిన అధికార టీఆర్ఎస్ అన్ని ప్రధాన అడ్వర్టైజ్మెంట్ కంపెనీల హోర్డింగ్లతో పాటు, మెట్రో పిల్లర్ల ను కూడా బుక్ చేసుకుంది.
బై బై మోదీ అంటూ...
మెట్రో పిల్లర్లపై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసే ఫ్లెక్సీలను అధికార పార్టీ ఏర్పాటు చేసింది. దీంతో బీజేపీకి హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలకు చోటు లేకుండా చేసింది. ఇదిలా ఉంటే బీజేపీ ఆఫీసులో సాలు సారూ అంటూ కేసీఆర్ ఫొటోతో కౌంట్ డౌన్ తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి పోటీగా మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. సాలు మోదీ.. బైబై మోదీ అంటూ హైదరాబాద్ లో టీఆర్ఎస్ పోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
Next Story