Sun Dec 29 2024 10:42:18 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల నుంచి పాఠశాలలను నిర్వహిస్తారు
తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పాఠశాలలను నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని విద్యాశాఖ పేర్కొంది. ఈ సమయంలో ఒక్క పదో తరగతి విద్యార్థులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
పదో తరగతి విద్యార్థులకు....
పదో తరగతి పబ్లిక్ పరీక్షలుండటంతో వారికోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు. ఎండలు విపరీతంగా పెరిగాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో నేటి నుంచి పాఠశాలలను ఒంటిపూట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
Next Story