Sun Dec 22 2024 05:02:09 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ఇంటర్ పరీక్షలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రశ్న
సినిమాలోని పాటలు, డైలాగ్‌లకు రీల్స్ తయారు చేయడం.. మీమ్స్ చేయడం.. ఇలా క్రేజ్ భారీగానే సాగింది. ఇప్పుడు తెలంగాణ..
హైదరాబాద్ : పోటీ పరీక్షల్లో సాధారణంగా సినిమా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది ఎవరికి.. ఎక్కువ ఆస్కార్స్ ఎవరు గెలుచుకున్నారు. ఇలా ప్రశ్నలను మనం చూస్తూ ఉండడం చాలా.. చాలా కామన్..! అయితే తెలంగాణ ఇంటర్ పరీక్ష ప్రశ్నా పత్రంలో ఆర్.ఆర్.ఆర్. సినిమాకు సంబంధించిన ప్రశ్న అడగడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్. సినిమా వచ్చి రెండు నెలలు అవుతున్నా కూడా సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.
సినిమాలోని పాటలు, డైలాగ్‌లకు రీల్స్ తయారు చేయడం.. మీమ్స్ చేయడం.. ఇలా క్రేజ్ భారీగానే సాగింది. ఇప్పుడు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు తన ప్రశ్నపత్రంలో RRRకి సంబంధించిన ప్రశ్నను చేర్చింది.తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో 'ఆర్ఆర్ఆర్' లోని కొమరంభీం పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్న అడిగారు. . 'ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరంభీం పాత్రలో తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్‌తో.. మీరు ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలు అడిగి.. సమాధానాలు తెలుపుతూ ఓ వ్యాసం రాయండి' అని ప్రశ్నగా ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్లో జూనియర్ ఎన్టీఆర్ నటనను చూసిన తర్వాత టీవీ ఛానల్ రిపోర్టర్‌గా ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేస్తే.. సినిమా గురించి, దర్శకుడితో అతని అనుబంధం వంటి కొన్ని ప్రమాణాల ఆధారంగా ఇంటర్వ్యూను సమాధానంగా రాయమని అభ్యర్థులను ప్రశ్న కోరింది. ఆ ప్రశ్నకు సంబంధించిన ప్రశ్నా పత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story