Mon Nov 25 2024 17:27:45 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రోజులు వైన్ షాపుల బంద్
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆ జిల్లాలో మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆ జిల్లాలో మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నవంబరు 1వ తేదీ సాయంత్రం నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ జిల్లాలో వైన్ షాపులు బంద్ చేయాలని జిల్లా ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
3న ఎన్నిక కావడంతో...
మునుగోడు ఉప ఎన్నిక ఈ నెల 3వ తేదీన జరగనుంది. ఏడు మండలాల్లో ఎక్సైజ్ శాఖ గట్టి నిఘాను పెట్టిందన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత మునుగోడు ప్రాంతంలో పెద్దయెత్తున మద్యం విక్రయాలు జరిగాయని ఎక్పైజ్ శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ మద్యం విషయంలో అనేక కేసులు నమోదు చేశామని తెలిపారు.
Next Story