Fri Nov 22 2024 16:47:33 GMT+0000 (Coordinated Universal Time)
చిరుత సంచారం.. హడలిపోతున్న గ్రామస్థులు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గాంధారి ఖిల్లా ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గాంధారి ఖిల్లా ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. మందమర్రి మండలంలోని గాంధారి ఖిల్లా ప్రాంతంలో చిరుతపులి సంచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈనెల ఐదో తేదీన ఉదయం ఉపాధి హామీ కూలీలు పనులకు వెళ్తుండగా దుప్పి కళేబరాన్ని గుర్తించిన వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
పులి తిరుగుతుండటంతో...
చిరుత పులి సంచారం ఉందని భావించిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుప్పి కళేబరంపై ఉన్న గాయాల గుర్తుల ఆధారంగా చిరుత దాడి చేసి చంపినట్లు అటవీ శాఖ అధికారులు తేల్చారు. దాహార్తి తీర్చుకోవటానికి వచ్చిన చిరుతపులి బారిన పడిఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story