Sat Dec 28 2024 21:31:59 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో మంత్రులు డమ్మీలే
మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రులు ఇన్ఛార్జులుగా ఉన్న గ్రామాల్లో బీజేపీ మెజారిటీ వచ్చింది
మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రులు ఇన్ఛార్జులుగా ఉన్న గ్రామాల్లో బీజేపీ మెజారిటీ వచ్చింది. దీంతో మంత్రుల ప్రభావం పెద్దగా కనిపించలేదని తెలిసింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇన్ఛార్జులుగా ఉన్న గ్రామాల్లో బీజేపీకి మెజారిటీ రావడంతో మంత్రుల పనితీరుపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టిసారించాల్సి ఉంది.
ప్రభావం లేదట...
మనుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు, కేసీఆర్ మాత్రమే ప్రభావం చూపారు. ఇక్కడ మంత్రులు నెల రోజుల పాటు పనిచేసినా పెద్దగా ఫలితం కన్పించడం లేదు. ఐదో రౌండ్ ముగిసే సమయానికి కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. రౌండ్ రౌండ్ కి ఉత్కంఠ పెరుగుతుంది. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీకి 1,100 మెజారిటీ లభించింది.
Next Story