Fri Apr 04 2025 03:12:50 GMT+0000 (Coordinated Universal Time)
వరస సెలవులు... టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ
వరుస సెలవుల నేపథ్యంలో హైద్రాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది

వరుస సెలవుల నేపథ్యంలో హైద్రాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. వరుస సెలవులు రావడం తో హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు ప్రజలు బయలుదేరి వెళుతున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీతో కొంత ఆలస్యమవుతుంది.
ఐదు రోజుల పాటు...
ఈరోజు ఆగస్టు 15వ తేదీ గురువారం కావడంతో శుక్రవారం సెలవు పెట్టుకుంటే శని, ఆదివారాలు సెలవు దినాలు రావడం, సోమవారం రాఖీ పండగ రోజు సెలవు దినం కావడంతో ఐదు రోజుల పాటు వరస సెలవులు జనాన్ని ఊరి బాట పట్టించాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు ఇదే మంచి సమయమని భావించి సొంత కార్లలో ఉదయాన్నే బయలుదేరారు. దీంతో ఫాస్టాగ్ సౌకర్యం ఉన్నప్పటికీ టోల్ ప్లాజాను దాటడమంటే గగనంగా మారిపోయింది.
Next Story