Sun Nov 24 2024 16:37:08 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్ ను వణికిస్తున్న కరోనా
వరంగల్ లో కరోనా కలకలం రేగింద.ి సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు
వరంగల్ లో కరోనా కలకలం రేగింద.ి సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 19 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని కూడా కరోనా వదిలపెట్టడం లేదు. ఎంజీఎం ఆసుపత్రిలో దాదాపు 72 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో ఎంజీఎం లోకి వెళ్లేందుకు ప్రజలు భయపడిపోతున్నారు.
వైద్య సిబ్బందికి...
ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ సయితం కరోనాకు గురయ్యారు. కరోనా బారిన పడిన వారింత హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. వైద్య సిబ్బంది ఇటీవల బూస్టర్ డోస్ తీసుకున్నప్పటికీ కరోనా సోకడం చర్చనీయాంశమైంది.
Next Story