Mon Dec 23 2024 20:17:18 GMT+0000 (Coordinated Universal Time)
సెక్రటేరియట్ ప్రారంభం వాయిదా
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు నాడు ఆర్భాటంగా ఈ సచివాలయాన్ని ప్రారంభించాలనుకున్నారు. జాతీయ స్థాయి నేతలకు కూడా ఆహ్వానాలను పంపాలని భావించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్...
కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సచివాలయం ప్రారంభం వాయిదా పడినట్లు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రందింపులు జరిపినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ తర్వాత సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.
Next Story