Mon Dec 23 2024 20:06:40 GMT+0000 (Coordinated Universal Time)
బండరాళ్ల మధ్య యువకుడు..40 గంటలుగా నరకయాతన
అడవిని చూద్దామని వెళ్లిన ఒక యువకుడు బండరాళ్ల మధ్య చిక్కుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.
అడవిని చూద్దామని వెళ్లిన ఒక యువకుడు బండరాళ్ల మధ్య చిక్కుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. రెడ్డిపేటకు చెందిన రాజు అనే యువకుడు తన స్నేహితుడితోకలిసి సింగరాయపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. సరదాగా వెళ్లిన రాజు, మహేష్ లు బండరాళ్లపైకి ఎక్కి కూర్చున్నారు. అయితే బండరాళ్ల మధ్య నడుస్తుండగా రాజు గుహల్లో చిక్కుకుపోయాడు. మహేష్ కాసేపు రాజును బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. దీంతో గ్రామంలోకి వెళ్లి చెప్పగా స్థానికులు వచ్చి ప్రయత్నించారు. అయినా రాజును వారు రక్షించలేకపోయారు.
అన్ని ప్రయత్నాలు...
దీంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిన్నటి నుంచి రాజును బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. మంగళవారం సాయంత్రం బండరాళ్ల మధ్య చిక్కుకుపోయిన రాజు ఇప్పటివరకూ బయటకు రాలేదు. నాలుగు జేసీబీలను తెచ్చి బండరాళ్లను పక్కకు తీసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు రాజును బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కామారెడ్డి ఎస్సీ స్వయంగా ఘటన స్థలికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 40 గంటలుగా రాజు నరకయాతన అనుభవిస్తున్నాడు. అతనికి ఆహారాన్ని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందచేస్తున్నారు. ఛార్జింగ్ పెట్టిన ఫ్యాన్ ద్వారా గాలి ఆడేలా ఏర్పాటు చేశారు.
Next Story