Mon Dec 23 2024 03:50:20 GMT+0000 (Coordinated Universal Time)
వాసవి కంపెనీలపై ఐటీ శాఖ దాడులు
వాసవి కంపెనీ, సుమధుర కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్నాయి.
వాసవి కంపెనీ, సుమధుర కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్నాయి. రెండో రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 30 చోట్ల సోదాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరుల్లో ఈ సోదాలను ఐటీ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలను నడుపుతూ పెద్దయెత్తున ప్రభుత్వానికి పన్ను ఎగవేశారన్న కారణంపై సోదాలు జరుగుతున్నాయి.
రెండో రోజు...
అయితే ఈ సందర్భంగా పెద్దమొత్తంలో నల్లధనాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారి నుంచి పెద్దమొత్తంలో నల్లధనాన్ని తీసుకున్నారని ఈ సోదాల ద్వారా తేలిందని చెబుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ కంపెనీల వద్ద ఉన్న సేల్ అగ్రిమెంట్లను కూడా స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అయితే ఈ కంపెనీలో కొందరు ముఖ్యులు పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలున్నాయి.
Next Story