Mon Dec 23 2024 05:43:58 GMT+0000 (Coordinated Universal Time)
చీకోటి ప్రవీణ్ కు ఐటీ నోటీసులు
క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. చీకోటి ప్రవీణ్ రేంజ్ రోవర్ కారు ఎలా కొనుగోలు చేశారన్న దానిపై నోటీసులు ఇచ్చారు. ఈ కారు ఖరీదు మూడు కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మూడు కోట్ల కారును...
అయితే ఈ కారును బినామీ పేరు మీద చికోటి ప్రవీణ్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. భాటియా ఫర్నీచర్ పేరు మీద కారు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ చీకోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కు ఈ కారు వ్యవహారం చికాకుగా మారనుంది.
Next Story