Mon Dec 23 2024 06:43:38 GMT+0000 (Coordinated Universal Time)
Ponguleti : పొంగులేటి ఇళ్లలో రెండోరోజూ ఐటీ సోదాలు
కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో రెండోరోజు కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో రెండోరోజు కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న తెల్లవారు జామున ప్రారంభమైన తనిఖీలు నేడు కూడా కొనసాగుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్ లలోని ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు.
బంధువులు, ఉద్యోగులు...
పొంగులేటి బంధువులు, ఉద్యోగుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. పొంగులేటి రూంకు సంబంధించిన తాళం కోసం అధికారులు వాచ్మెన్ ను ప్రశ్నించారు. అయితే తన వద్ద లేదని, కీ మేడమ్ వద్ద ఉందని చెప్పడంతో ఐటీ అధికారులు పొంగులేటి సతీమణికి ఫోన్ చేసి కీ గురించి వాకబు చేశారు. ఆ గది తలుపు తెరవాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Next Story