Fri Dec 20 2024 08:51:43 GMT+0000 (Coordinated Universal Time)
Komatireddy : కోమటిరెడ్డి తోడల్లుడి ఇంటిపై ఐటీ రైడ్స్
కోకాపేట్ ఈడెన్ గార్డెన్స్ లో ఉన్న గిరిధర్ రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
కోకాపేట్ ఈడెన్ గార్డెన్స్ లో ఉన్న గిరిధర్ రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు. గిరిధర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల వేళ ఐటీ దాడులు జరుగుతుండటం రాజకీయ పార్టీల్లో అందులో విపక్షాల్లో ఆందోళన కలిగిస్తుంది.
వరసగా దాడులతో...
ఇప్పటికే ఉదయం నుంచి మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారిెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే బడంగ్ పేట్ మేయర్ పారిజాతం ఉంటున్న బాలాపూర్ ఇంట్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. గిరిధర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో మూడు బృందాలు సోదాలు జరుపుతున్నాయి.
Next Story