Mon Dec 23 2024 13:49:53 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. యాభై బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం యాభై బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మల్లారెడ్డికి చెందిన యూనివర్సిటీతో పాటు ఆయన కళాశాలలో కూడా సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారు జాము నుంచే ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
కూతురు, కొడుకు ఇంట్లోనూ...
మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కూతురు, కొడుకు ఇళ్లల్లో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో ఒక బృందం సోదాలు నిర్వహిస్తుంది. కొంపల్లిలో ఆయనకు ఉన్న విల్లాలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఆదాయపు పన్ను నిబంధనలను అతిక్రమించారని భావించి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
Next Story