Mon Dec 23 2024 07:04:18 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జానారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ సోదాలు జరగుతుండటం సంచలనం రేపుతుంది. మొత్తం పద్దెనిమిది చోట్ల కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు జరుపుతున్నారు. జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
రెండో రోజు...
తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు ఐటీ సోదాలు జరగుతున్నాయి. నిన్న మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బడంగ్ పేట్ మేయర్ పారిజాతం ఇళ్లతో పాటు పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు ఈరోజు జానా రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర బంధువుల ఇళ్లలో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
Next Story