Sat Mar 01 2025 03:41:04 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి ఇంటిపై ఈడీ అటాక్..రీజన్ అదేనా?
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులో మంత్రి గంగుల ఇంటితో పాటు ఆయ సోదరుల ఇళ్లల్లోనూ తనిఖీలు అధికారులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, హైదరాబాద్ లలో ఆయన నివాసంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఉదయం ప్రారంభమైన తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
దుబాయ్ లో ఉన్న...
మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తుతం ఇక్కడ లేరు. ఆయన దుబాయ్ లో ఉన్నారు. కుటుంబంతో సహా గంగుల దుబాయ్ లో ఉన్న సమయంలో ఈడీ, ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. బంధువులు, స్థానిక పోలీసుల సమక్షంలో తాళాలు పగుల కొట్టి ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఐటీ, ఈడీ దాడుల విషయం తెలిసిన గంగుల దుబాయ్ నుంచి బయలుదేరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గంగుల సోదరులు, ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ దాడులు జరుగుతున్నాయి.
Next Story