Sun Dec 22 2024 18:35:07 GMT+0000 (Coordinated Universal Time)
Nalgonda: అస్సాంలో మరణించిన నల్గొండకు చెందిన ఆర్మీ జవాన్
మహేష్ మృతితో అతడి స్వగ్రామంలో విషాదఛాయలు
నల్గొండ జిల్లాలోని మాదారిగూడెంకు చెందిన భారత ఆర్మీ జవాన్ మహేశ్ అనారోగ్యంతో మృతి చెందాడు. 24 ఏళ్ల వయసున్న మహేష్ ఏడాది కాలంగా అస్సాంలో పనిచేస్తున్నాడు. మహేశ్ మృతి చెందిన సమాచారాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంత కాలంగా అస్వస్థతకు గురైన మహేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన భౌతికకాయాన్ని నల్గొండకు తరలించేందుకు అస్సాం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఏడాదిన్నర కాలంగా అస్సాంలో ఆర్మీ జవాన్ గా మహేష్ విధులు నిర్వర్తిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి వాతావరణం అనుకూలించక పోవడంతో అనారోగ్యానికి గురయ్యారని మాత్రమే తమకు సమాచారం ఉందని తెలిపారు. కోలుకుంటాడని ఆశించామని.. కానీ చనిపోయాడనే వార్తను వింటామని అసలు ఊహించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మహేష్ మృతి చెందాడని తెలుసుకున్న గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.
Next Story