Mon Dec 23 2024 15:36:22 GMT+0000 (Coordinated Universal Time)
టెస్లా కంపెనీతో చర్చలు జరుపుతున్నాం
పరిశ్రమ స్థాపన టెస్లా కంపెనీతో చర్చలు జరుపుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు
పరిశ్రమ స్థాపన టెస్లా కంపెనీతో చర్చలు జరుపుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈవీ కార్లలో నెంబర్ వన్ కంపెనీ అయిన టెస్లాను తెలంగాణకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ రాకతో సాఫ్ట్వేర్ రంగంలో రూపరేఖలే మారిపోయాయని ఆయన అన్నారు. ఈ రంగంలోనే భవిష్యత్ లో అనేక అవకాశాలుంటాయని తెలిపారు. దేశంలోనే సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణలో రెండో స్థానంలో ఉందన్న శ్రీధర్ బాబు త్వరలోనే మొదటి ర్యాంకుకు తీసుకెళతామని చెప్పారు.
ఏఐ సిటీ కోసం...
సైబర్ టవర్స్ లో పీఎస్ఆర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ టెక్ హబ్ ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. జులై నెలలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పై హైదరాబాద్ లో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ కోసం రెండు వందల ఎకరాలు కేటాయించామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీని కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ఐటీ రంగానికి కావాల్సిన అవసరాలను తీరుస్తామని శ్రీధర్ బాబు తెలిపారు.
Next Story