Mon Dec 23 2024 11:56:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు కూడా విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ
తెలంగాణలో విద్యుత్తు ఒప్పందాలపై విచారణ కొనసాగుతుంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోకమిషన్ ఈ విచారణ చేపట్టింది
తెలంగాణలో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలపై విచారణ కొనసాగుతుంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటయిన కమిషన్ ఈ విచారణను ను కొనసాగిస్తుంది. బీఆర్కే భవన్ లో ఈ విచారణ గత కొద్ది రోజులుగా జరుగుతంది. ఛత్తీస్గడ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తు ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కమిషన్ విచారణ జరుపుతుంది.
ఒప్పందాలపై నేడు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుదుర్చుకున్న వివిధ విద్యుత్తు ఒప్పందాలను కూడా పరిశీలిస్తుంది. దీనిపై ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు కమిషన్ ను కలసి విద్యుత్తు రంగ నిపుణులు అందుకు సంబంధించిన సమాచారాన్ని అందచేయనున్నారు. ఈరోజు విద్యుత్తు రంగ నిపుణులు తిమ్మారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి కమిషన్ ఎదుట హాజరై సమాచారం తెలియజేయనున్నారు.
Next Story