Sat Jan 11 2025 20:10:23 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై స్టే యధాతధం
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై స్టే కొనసాగుందని తెలిపింది
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై స్టే కొనసాగుందని తెలిపింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. వీడియోలు, ఆడియోలు హైకోర్టు ఆరా తీసింది. కేసు విచారణ పూర్తయ్యేంత వరకూ ఆడియో, వీడియోలు బయటపెట్టకూడదని ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి బీజేపీ, నందకుమార్ భార్య వేసిన పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఫోన్లు ట్యాప్ చ
సోమవారానికి...
బీజేపీ సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఛార్జిషీట్ వేసే వరకూ ఆడియో, వీడియోలను బహిర్గతం చేయరాదని కోరింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వం వేసిన కౌంటర్ కు రిప్లై ఇచ్చేందుకు గడువు కావాలని ప్రతివాదులు కోరారు. అసలు జోక్యం చేసుకోవాలా? వద్దా? అనే దానిపై స్పష్టత రావాలని హైకోర్టు అభిప్రాయపడింది. వాటిని అనుమతించాలని రిజస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది.
Next Story