Mon Dec 23 2024 15:49:24 GMT+0000 (Coordinated Universal Time)
కేజీఎఫ్-2 సినిమా చూసి ఒక ప్యాక్ సిగరెట్లు తాగిన 15 ఏళ్ల బాలుడు.. చివరికి..!
టీనేజర్లు ‘రాకీ భాయ్’ లాంటి క్యారెక్టర్స్ ద్వారా సులభంగా ప్రభావితమవుతారు. ఈ టీనేజర్ ధూమపానానికి అలవాటు పడ్డాడు. సిగరెట్ ప్యాకెట్‌ని
కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాల ఇంపాక్ట్ మామూలుగా లేదు. యూత్ లో సినిమాకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. దేశ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ తో సినిమా దూసుకుపోతూ ఉంది. ఓటీటీలో కూడా సినిమా సందడి చేస్తూ ఉంది. ఈ సినిమాలో రాకీ భాయ్ గా యశ్ యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. యశ్ మేనరిజాన్ని ఇమిటేట్ చేసే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. తాజాగా యశ్ సిగరెట్ తాగే స్టైల్ ను అనుకరించి హైదరాబాద్ కు చెందిన ఒక బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు.
KGF చాప్టర్ 2ని రెండు రోజుల్లో మూడు సార్లు చూసిన తర్వాత, హైదరాబాద్ కు చెందిన 15 ఏళ్ల బాలుడు రాకీ భాయ్ క్యారెక్టర్ నుండి ప్రేరణ పొంది ఫుల్ ప్యాక్ సిగరెట్ ను వెంటవెంటనే తాగాడు. దీంతో అతనికి తీవ్రమైన గొంతునొప్పి, దగ్గు రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శనివారం హైదరాబాద్‌లోని సెంచరీ ఆసుపత్రి వైద్యులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు టీనేజర్ కి విజయవంతంగా చికిత్స చేసినట్లు ప్రకటించారు.
ఈ ఘటనపై పల్మోనాలజిస్ట్ డాక్టర్ రోహిత్ రెడ్డి పాతూరి మాట్లాడుతూ.. టీనేజర్లు 'రాకీ భాయ్' లాంటి క్యారెక్టర్స్ ద్వారా సులభంగా ప్రభావితమవుతారు. ఈ టీనేజర్ ధూమపానానికి అలవాటు పడ్డాడు. సిగరెట్ ప్యాకెట్‌ని సేవించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మన సమాజంలో సినిమాలు చాలా ప్రభావితం చేసే అంశం. సిగరెట్లు తాగడం లేదా పొగాకు నమలడం లేదా మద్యం సేవించడం వంటి చర్యలను గ్లామరైజ్ చేయకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత చిత్ర నిర్మాతలు, దర్శకులకు, నటీనటులకు ఉంది. 'రాకీ భాయ్' వంటి పాత్రలు కల్ట్-ఫాలోయింగ్ కలిగి ఉంటాయి. యువకులు వాళ్లనే దేవుళ్లు అని అనుకోవచ్చు. "కౌమారదశలో ఉన్నవారి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారో.. వారి పిల్లల చర్యలను ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయో గమనిస్తూ ఉండాలి. పొగాకు తాగడం మరియు మద్యం సేవించడం వంటి చర్యల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడంలో తల్లిదండ్రులు పాత్ర పోషించడం చాలా ముఖ్యం" అని డాక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు.
KGF: చాప్టర్ 2 సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రంలో యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. రవి బస్రూర్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణికి మంచి పేరు వచ్చింది.
Next Story