Thu Dec 19 2024 18:11:25 GMT+0000 (Coordinated Universal Time)
Summer Effect : మాడు పగిలిపోతుంది...బయటకు పోతే ఇక అంతే
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే రోహిణి కార్తెను తలపిస్తుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. నిప్పులు చెరిగే ఎండలతో పాటు వేడి గాలులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
గరిష్ట ఉష్ణోగ్రతలు...
ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదయ్యే అవకాశాలున్నాయని, వేడిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని, అందుకే అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వచ్చినా తగిన జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బ తగిలే అవకాశముందని తెలిపింది. రానున్న కాలంలో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మే నెలలో మరింతగా పెరుగుతాయన్న భయంలో ప్రజలు ఉన్నారు.
Next Story