Tue Mar 25 2025 00:18:24 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు .. నిబంధనల్లో మార్పు
తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి

తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. అయితే నిమిషం ఆలస్యమయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతివ్వబోమని విధించిన నిబంధనను అధికారులు సడలించారు. ఐదు నిమిషాల వరకూ మినహాయింపు ఇచ్చారు.
ఐదు నిమిషాల మార్పు...
ఉదయం 9.05 గంటల వరకూ వచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8.45 గంటల నిమిషాలకు పరీక్ష కేంద్రాలకు వచ్చిన వారినే అనుమతిస్తామని తాము చెప్పినప్పటికీ, ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతిస్తామని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story