Wed Apr 09 2025 02:09:54 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి సబిత ఫలితలు విడుదల చేయనున్నారు

తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఉదయం పదకొండు గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
పది లక్షల మంది వరకూ...
గత మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలను తెలంగాణలో నిర్వహించారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు 4,82 లక్షల మంది, రెండో సంవత్సరం ఇంటర్ పరీక్షలకు 4.23 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. మూల్యాంకనం పూర్తయి ఇరవై రోజులు గడుస్తున్నా ఫలితాల విడుదల కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నేడు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను విడుదలచేయనుంది.
Next Story