Mon Dec 23 2024 01:50:10 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో నేటి నుండి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
10 రోజుల తర్వాత అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపడతామని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు..
తెలంగాణలో తిరిగి పట్టు సాధించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దీంతో నేటి నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఇంటింటీకీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం అవుతుందని.. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారని జ్ఞానేశ్వర్ చెప్పారు. 10 రోజుల తర్వాత అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపడతామని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో భారీగా సభను జరుపుతామని కాసాని జ్ఞానేశ్వర్ వివరించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీడీపీని తల్లి పార్టీ అని చెప్పడంపై కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. టీడీపీలోకి రేవంత్ ను ఆహ్వానిస్తున్నామని.. తల్లి పార్టీపై ప్రేమ ఉందన్న రేవంత్ కు టీడీపీ స్వాగతం పలుకుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇస్తామని.. పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ టీడీపీకి సంబంధించి పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీ నియామకం ఉంటుందని చెప్పారు.
Next Story