Wed Jan 01 2025 19:42:21 GMT+0000 (Coordinated Universal Time)
Venu Swamy : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ వేణుస్వామి... అనవసర వివాదాల్లో తలదూర్చడం హాబీగా మార్చుకుని?
ఒకరి వ్యక్తిగత జీవితంలోకి చొరబడి అందరినీ భయపెడుతూ.. జాతకం తిరగబడిందనే వేణుస్వామి జాతకం చివరకు రివర్స్ అయ్యేటట్లుంది
ఒకరి వ్యక్తిగత జీవితంలోకి చొరబడి అందరినీ భయపెడుతూ.. జాతకం తిరగబడిందంటూ ఆందోళనకు గురి చేస్తున్న వేణుస్వామి జాతకం చివరకు రివర్స్ అయ్యేటట్లుంది. వేణుస్వామి అందరి జాతకాలు చెబుతారు. తాను దైవాంశ సంభూతిడినంటూ బిల్డప్ ఇస్తాడు. అందరి జాతక చక్రాలు వేసి సోషల్ మీడియాలో రేటింగ్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రధానంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేణుస్వామి జాతకాలు చెబుతూ అందరి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తాడు.
హీరోయిన్లను...
గతంలో ఎన్నోమార్లు వేణుస్వామి వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. అనేక విషయాల్లో తలదూర్చి తాను తలనొప్పులు తెచ్చుకున్నాడు. సినీ సెలబ్రిటీలు తన చేత పూజల చేయించుకున్న తర్వాతనే వారి దశ తిరిగిదంటూ నమ్మబలుకుతాడు. ఒక హై క్లాస్ తాంత్రికుడు.. మాంత్రికుడు ఇతడు. సాధారణంగా టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ల సినిమా జీవిత కాలం అతి తక్కువగా ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఫేడ్ అవుతారు. హీరోలు లెక్క కాదు. హీరోయిన్లను కొత్త వారిని తెచ్చి బాక్సాఫీసు వద్ద నాలుగు రూపాయలు సంపాదించుకోవాలనుకునే దర్శకులతో హీరోయిన్లు సుదీర్ఘకాలం టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోతున్నారు.
హీరోయిన్లే టార్గెట్ గా...
అందుకే హీరోయిన్లనే వేణుస్వామి లక్ష్యంగా చేసుకుని పూజలు చేస్తానని నమ్మిస్తాడు. పూజల తర్వాత వాళ్ల అదృష్టం కొద్దీ ఏదో ఒక సినిమాలో బుక్ అయితే అది తన ప్రతిభేనని అంటారు. ఇక రాజకీయాలను కూడా మనోడు వదలడు. తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఓడపోతాడని చెప్పాడు. కేసీఆర్ ఓడిపోవడంతో వేణుస్వామిపై మరింత గురి పెరిగింది. దీంతో సెలబ్రిటీల రాక మరింత ఎక్కువయింది. సెంటిమెంట్, భయం ఎక్కువగా ఉండే సినీ పరిశ్రమను క్యాష్ చేసుకునే వేణుస్వామి ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ గెలుస్తాడని చెప్పి ఓటమి తర్వాత ఇక తాను జాతకాలు చెప్పనంటూ శపథం కూడా పూనాడు.
నాగచైతన్య, శోభిత ఇష్యూలో...
ఇక తాజాగా నాగచైతన్య, శోభిత ఇష్యూలో మనోడు ఎంట్రీ ఇచ్చాడు. వారిద్దరూ అలా ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే వారికి పిల్లలు పుట్టరని, విడిపోతారంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మూడేళ్లకు మించి వారి కాపురం సజావుగా జరగదని అన్నాడు. 2017 నాటి వరకూ వారి కాపురం సజావుగా జరుగుతుందన్నాడు. దీంతో టాలీవుడ్ పరిశ్రమకు ఆగ్రహం వ్యక్తం చేసింది. వేణుస్వామిపై నిషేధం విధించాలని తీర్మానించింది. అలాంటి వేణుస్వామికి తెలంగాణ మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 22న మహిళ కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. జాతకం చెబుతూ ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్న వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలంటూ మహిళ కమిషన్ కు పెద్దయెత్తున ఫిర్యాదులు అందాయి.
Next Story