పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్ల మేర మోసం.. 9 మంది అరెస్ట్
సైబర్ ట్యూటర్స్ చైనా ను కేంద్రంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్
నేటి ప్రపంచంలో ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. ఏ చిన్న పొరపాటు చేసిన చిన్న ఆధారం దొరికినా పోలీసులు కంటి చూపు నుండి నిందితులు తప్పించుకోలేరు. సైబర్ నేరగాళ్లు కూడా అదే టెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్నెన్నో నేరాలకు పాల్పడుతున్నారు. అయినా కూడా పోలీసులు ఆ కేటుగాళ్లకు చెక్ పెట్టి వారి ఆట ముగిస్తున్నారు. చైనా కేంద్రంగా చేసుకొని కొంతమంది కేటుగాళ్లు ఇన్వెస్ట్మెంట్ పేరుతో వందలాది మందిని మోసం చేసిన కేసుల్లో ఓ చిన్న ఆధారం తో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు. ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్ నుండి ప్రకాష్ ముల్ చంద్ భాయ్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి, నహీముద్దీన్ వాహిదుధ్దీన్ షైక్, గాగన్ కుమార్ సోనీ, పర్వీజ్ అలియాస్ గుండు, సమీర్ ఖాన్, మహమ్మద్ మున్నావార్,షాహీ సుమైర్, అరుల్ దాస్ అనే తొమ్మిది మంది ఇన్వెస్ట్మెంట్ పేరుతో అమాయకమైన జనాలకు గాలం వేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు.