Thu Dec 19 2024 17:13:46 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డి కొత్త సెక్రటరీ ఎవరో తెలుసా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరీగా ఐపీఎస్ అధికారి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరీగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం షానవాజ్ ఖాసిం హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్నారు. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబద్ సీపీగా అవినాశ్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు నియమితులయ్యారు. హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్స్ వింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు.
భారీ మార్పులు జరగబోతున్నాయా:
తెలంగాణ లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబులను నియమించారు. నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గా సందీప్ శాండిల్యను నియమించారు. రాచకొండ సీపీగా ఉన్న చౌహాన్, సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రలను డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. వీరిద్దరికీ పోస్టులు కేటాయించకపోవడంపై చర్చ జరుగుతూ ఉంది.
Next Story