Wed Jan 15 2025 08:45:46 GMT+0000 (Coordinated Universal Time)
పార్లమెంటులో కాంగ్రెస్ వార్ రూమ్ ఇష్యూ
హైదరాబాద్లోని కాంగ్రెస్ వార్ రూమ్ అంశం పార్లమెంటును తాకింది. కాంగ్రెస్ సభ్యులు ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు
హైదరాబాద్లోని కాంగ్రెస్ వార్ రూమ్ అంశం పార్లమెంటును తాకింది. కాంగ్రెస్ సభ్యులు ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఈ అంశంపై చర్చించాని పట్టుబడుతున్నారు. నిన్న మాదాపూర్ లో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై తెలంగాణ పోలీసులు దాడి చేసి కొందరిని అరెస్ట్ చేశారు. డేటాతో పాటు హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లారు. కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు.
బీఆర్ఎస్ భవనం ముట్టడికి...
దీనిపై కాంగ్రెస్ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ ఎంపీలు, నేతలు కూడా బయలుదేరారు. బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ పోలీసు బలగాలతోపాటు కేంద్ర బలగాలు కూడా బీఆర్ఎస్ భవన్ వద్ద మొహరించాయి. ఎవరిని అటువైపు రాకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు దీనిపై చర్చించేందుకు ఢిల్లీలో ఎంపీలు సమావేశం అవుతున్నారు.
Next Story