Telangana : రేవంత్ ఏడాది పాలనకు ఎన్ని మార్కులేయొచ్చు?
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుంది. రేవంత్ రెడ్డి పార్టీ నేతలను ఐక్యంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు
కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైనా శత్రువులు ఎవరో లేరు. సొంత పార్టీలో ఉన్న నేతలే శత్రువులు. ఆ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం అలాంటిది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకూ సామాన్యకార్యకర్త కూడా లెక్క చేయని పరిస్థితి ఒక కాంగ్రెస్ లోనే చూస్తుంటాం. ఎవరైనా విమర్శించవచ్చు. ఎంతటి ఆరోపణలైనా చేయొచ్చు. ఢిల్లీలో పెద్దల ఆశీర్వాదం ఉంటే నేరుగా మీడియాసమావేశాలు పెట్టి తిట్టిన తిట్టకుండా తిట్టినా అలాంటి నేతలపై ఎటువంటి చర్యలుండవు. అదీ కాంగ్రెస్. ఇది ఏ ఒక్క రాష్ట్రానికి మాత్రమే కాదు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నకాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కూడా సరిగా కంటి మీద కునుకు ఉండదు. ఏదో్ ఒకపుల్ల పెడుతూనే ఉంటారు. ముఖ్యమంత్రులు తమ పదవులను కాపాడుకో్వడానికే సమయం వెచ్చించాల్సి వస్తుంది. ముందు పార్టీలో అసంతృప్తి లేకుంటే పాలన సజావుగా చేయవచ్చు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఇది కొరవడుతుంది.