Mon Dec 23 2024 03:03:28 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి హుండీ లెక్కింపు
మేడారం జాతర ముగియడంతో అమ్మవారికి మొక్కుల రూపంలో భక్తులు ఎంత చెల్లించుకున్నారన్నది ఆసక్తికరం.
మేడారం జాతర ముగిసింది. కోటిన్నర మంది భక్తులు హాజరయి ఉంటారని అంచనా. అయితే మేడారం జాతర ముగియడంతో అమ్మవారికి మొక్కుల రూపంలో భక్తులు ఎంత చెల్లించుకున్నారన్నది ఆసక్తికరం. ఈరోజు నుంచి మేడారం జాతర హుండీ లెక్కింపు ప్రారంభం కానుంది. దాదాపు పది రోజుల పాటు ఈ లెక్కింపు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో నేటి నుంచి హుండీ లెక్కింపు జరుగుతుంది.
పది రోజుల పాటు....
మేడారం లో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 497 హుండీలను అధికారులు అత్యంత భద్రత ఏర్పాట్ల మధ్య హన్మకొండకు తీసుకు వచ్చారు. కోటినర్న మంది భక్తులు హాజరవ్వడంతో హుండీ రూపంలో ఆదాయం గణనీయంగానే వచ్చి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హుండీలో లెక్కింపు కోసం ఆలయ సిబ్బంతో పాటు స్వచ్ఛంద సేవాసంస్థలు, సేవా బృందాల సభ్యులు పాల్గొంటారు. హుండీ లెక్కింపు సందర్భంగా పోలీసులు పెద్దయెత్తున భద్రత ఏర్పాట్లను చేశారు.
Next Story