Thu Dec 19 2024 06:02:47 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టు నిర్ణయం నేడు...?
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు హైకోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు హైకోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీజేపీ నేత ప్రమేందర్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసును ప్రత్యేక సంస్థలకు దర్యాప్తు బాధ్యత అప్పటగించాలని పిటీషన్ వేసే అర్హత బీజేపీకి ఉందా? లేదా? అన్న దానిపై నేడు హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది.
ఇరు పక్షాలు...
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు హైకోర్టు వినింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈరోజు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు హైకోర్టు వెలువరిస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story